కరోనా ఎఫెక్ట్: పెళ్లిళ్లు సరే, విడాకులకూ తప్పని బ్రేక్!

ABN , First Publish Date - 2020-04-09T22:53:07+05:30 IST

దుబాయ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లతో పాటూ విడాకుల తీసుకోవాడాన్ని కూడా వాయిదా వేసింది. ప్రజలు ఓక చోట గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దుబాయ్ న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనా ఎఫెక్ట్: పెళ్లిళ్లు సరే, విడాకులకూ తప్పని బ్రేక్!

దుబాయ్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వారిని ఇళ్లకే పరిమితం చేసేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాయి. తాజాగా దుబాయ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లతో పాటూ విడాకుల తీసుకోవాడాన్ని కూడా వాయిదా వేసింది. ప్రజలు ఓక చోట గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దుబాయ్ న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా లెక్కల ప్రకారం యూఏఈలో కరోనా కేసుల సంఖ్య 2000 దాటిపోయింది. 12 మంది పౌరులు దీనికి బలయ్యారు. ఇక యూఏఈలో భాగమైన దుబాయ్‌లో జనజీవనం స్థంభించిపోయింది. లాక్ డౌన్ కారణంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు మూతపడ్డాయి. 


Updated Date - 2020-04-09T22:53:07+05:30 IST