UK చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. Dubai రాజు తన మాజీ భార్యకు ఎంత ఇవ్వబోతున్నాడో తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే!

ABN , First Publish Date - 2021-12-22T19:29:03+05:30 IST

తన ఆరో భార్య, జోర్దాన్‌ మాజీ రాజు కుమార్తె హయా బింట్‌ అల్‌ హుస్సేన్‌(47)తో విడాకుల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో దుబాయ్‌ రాజు మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్దూమ్‌(72) ఏకంగా రూ. 5527 కోట్ల మనోవర్తి చెల్లించే అవకాశం ఉంది. ఈ మేరకు బ్రిటన్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. వీటిలో రూ.2,521 కోట్లను హయాకు ఏకమొత్తంలో చెల్లించాలని పేర్కొంది. రషీద్‌ భార్యల్లో హయా అందరికన్నా చిన్నవారు.

UK చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. Dubai రాజు తన మాజీ భార్యకు ఎంత ఇవ్వబోతున్నాడో తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే!

లండన్‌: తన ఆరో భార్య, జోర్దాన్‌ మాజీ రాజు కుమార్తె హయా బింట్‌ అల్‌ హుస్సేన్‌(47)తో విడాకుల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో దుబాయ్‌ రాజు మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్దూమ్‌(72) ఏకంగా రూ. 5527 కోట్ల మనోవర్తి చెల్లించే అవకాశం ఉంది. ఈ మేరకు బ్రిటన్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. వీటిలో రూ.2,521 కోట్లను హయాకు ఏకమొత్తంలో చెల్లించాలని పేర్కొంది. రషీద్‌ భార్యల్లో హయా అందరికన్నా చిన్నవారు. వీరికి అల్‌ జలిలియా (14), జయాద్‌ (9) పిల్లలు. పిల్లల చదువు కోసం రూ.96 కోట్లు, వారి బాధ్యతల కోసం రూ.112 కోట్లు ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇతర అసవరాలకుగాను రూ.2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బ్రిటన్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదీ ఒకటని పరిశీలకులు అంటున్నారు.

Updated Date - 2021-12-22T19:29:03+05:30 IST