Dubai: దుబాయ్ నివాసితులకు రెండు వారాల గడువు.. ఈలోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలట..

ABN , First Publish Date - 2022-09-27T14:59:20+05:30 IST

దుబాయ్‌లో చాలా మంది అపార్ట్‌మెంట్స్ అద్దెకు తీసుకుని సబ్-రెంట్‌కు ఇస్తుంటారు. దీని కారణంగా నివాస చట్టం (Residency Act) సరిగా అమలు చేయడం కుదరడం లేదు.

Dubai: దుబాయ్ నివాసితులకు రెండు వారాల గడువు.. ఈలోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలట..

దుబాయ్‌: దుబాయ్‌లో చాలా మంది అపార్ట్‌మెంట్స్ అద్దెకు తీసుకుని సబ్-రెంట్‌కు ఇస్తుంటారు. దీని కారణంగా నివాస చట్టం (Residency Act) సరిగా అమలు చేయడం కుదరడం లేదు. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు ఎమిరేట్స్ హౌసింగ్ అథారిటీ (Emirates Housing Authority) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ పౌరులు వారి ఇంటిని అద్దెకు ఇచ్చిన వారి వివరాలను రెస్ట్ (REST) అనే యాప్‌లో రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. దీనికోసం రెండు వారాల గడువు ఇచ్చింది. ఇలా రెంట్‌కు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్ చేయడం ద్వారా రెసిడెన్సీ చట్టాన్ని సరిగా అమలు చేయవచ్చని తెలిపింది. అలాగే యజమాని అనుమతి లేకుండా సబ్-రెంట్ ఇస్తున్న వారి అక్రమాలకు సైతం చెక్ పెట్టొచ్చని పేర్కొంది. అపార్ట్‌మెంట్లు, భవనాలు, డెవలపర్లు, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీలతో పాటు అద్దెకు ఇస్తున్న వారు ఎవరికీ అద్దెకు ఇచ్చారో వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసిన తర్వాత ఎజారి (Ejari) అద్దె ఒప్పందంలో వారి వివరాలు అప్‌డేట్ అవుతాయి. 


రిజిస్ట్రేషన్‌ ఇలా... 

* దుబాయ్ రెస్ట్(REST) మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పేరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి

* అదే కొత్త వినియోగదారులైతే ముందుగా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది 

* మీరు ఇండివిజ్యువల్ అయితే “individual” అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యాక్సెస్ కోసం యూఏఈ పాస్‌తో లాగిన్ చేయాలి.

* యూఏఈ పాస్‌ను మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు అప్‌డేట్ చేసుకోవాలి

* డాష్‌బోర్డ్‌కు వెళ్లి మీరు అద్దె దారుగా ఉన్న (Tenant) ఆప్షన్‌ను ఎంచుకోవాలి

* అలాగే సహ-నివాసుల పేరును యాడ్ చేయడానికి యాడ్ మోర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

* సహ నివాసి ఎమిరేట్స్ ఐడీ నెం., పుట్టిన తేదీని నమోదు చేసి 'వెరిఫై' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 

* ఆ తర్వాల ఆ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారందరీ పేర్లు యాడ్ చేయాలి

* ఎవరైనా సహ నివాసి పేరు తీసివేయాలంటే రిమూవ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 

* అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. 

Updated Date - 2022-09-27T14:59:20+05:30 IST