నవంబర్ 10వ తారీఖు లోపు వాళ్లంతా Dubai నుంచి వెళ్లిపోవాల్సిందే

ABN , First Publish Date - 2021-08-24T17:12:49+05:30 IST

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారత్, నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా దేశాల పౌరుల రెసిడెన్సీ వీసాల గడువును దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) తాజాగా పొడిగించింది.

నవంబర్ 10వ తారీఖు లోపు వాళ్లంతా Dubai నుంచి వెళ్లిపోవాల్సిందే

దుబాయ్: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారత్, నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా దేశాల పౌరుల రెసిడెన్సీ వీసాల గడువును దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) తాజాగా పొడిగించింది. ఈ దేశాల వారి రెసిడెన్సీ వీసాల గడువును 2021 నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు జీడీఆర్ఎఫ్ఏ ప్రకటించింది. ఫ్లై దుబాయ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. 'దుబాయ్ జారీ చేసిన యూఏఈ రెసిడెన్సీ వీసాలు కలిగి ఉన్న భారత్, నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా దేశాల పౌరులు ఎవరైతే యూఏఈ బయట చిక్కుకున్నారో వారి రెసిడెన్సీ గడువును 2021 నవంబర్ 10 వరకు పొడిగిస్తూ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) నిర్ణయం తీసుకుంది' అని ఫ్లై దుబాయ్ పేర్కొంది.


అది కూడా ఏప్రిల్ 20, 2021 నుంచి నవంబర్ 09, 2021 మధ్య గడువు ముగిసిన లేదా ముగియనున్న వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇక దుబాయ్ జారీ చేసిన యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు ఎవరైతే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం యూఏఈ బయట ఉన్నారో.. అంటే అక్టోబర్ 20, 2021 ముందు దేశాన్ని విడిచి వెళ్లారో వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. కనుక వాళ్లంతా నవంబర్ 10వ తారీఖు లోపు దుబాయ్ నుంచి వెళ్లిపోవాల్సిందే. కాగా, దుబాయ్ జారీ చేసిన యూఏఈ రెసిడెన్సీ వీసాల స్టేటస్‌ను https://amer.gdrfad.gov.ae/visa-inquiry లింక్ ద్వారా ఆయా దేశాల ప్రవాసులు చెక్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు.       

Updated Date - 2021-08-24T17:12:49+05:30 IST