దుబాయ్‌కు ప్రయాణాలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-06-23T14:15:25+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలల పాటు రాకపోకలు స్తంభించిపోయిన దుబాయ్‌కు బుధవారం నుంచి ప్రయాణాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం యూఏఈ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రయాణికులు 48 గంటల ముందు మూడు లేయర్ల ఆర్టీపీసీఆర్‌ టెస్టు...

దుబాయ్‌కు ప్రయాణాలు పునఃప్రారంభం

దుబాయ్‌, జూన్‌ 22: కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలల పాటు రాకపోకలు స్తంభించిపోయిన దుబాయ్‌కు బుధవారం నుంచి ప్రయాణాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం యూఏఈ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రయాణికులు 48 గంటల ముందు మూడు లేయర్ల ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకొని నెగెటివ్‌గా తేలాలి. ఫైజర్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వంటి వ్యాక్సిన్లలో ఏదో ఒక టీకాకు సంబంధించి రెండు డోసులు వేసుకుని ఉండాలి. 

Updated Date - 2021-06-23T14:15:25+05:30 IST