వెన్ను నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్ చేసిన నిర్వాకం తెలిసి అవాక్కైన కోర్టు.. చర్చనీయాంశమైన తీర్పు..

ABN , First Publish Date - 2022-05-02T15:36:00+05:30 IST

విపరీతమైన వెన్ను నొప్పికి తాలలేక ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న ఆసుపత్రిని సందర్శించాడు. వైద్యుడి దగ్గరికెళ్లి తన బాధను వివరించాడు. ఈ క్రమంలో వైద్యుడు చేసిన పని వల్ల బాధితుడి నొప్పి తగ్గకపోగా మరింత

వెన్ను నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్ చేసిన నిర్వాకం తెలిసి అవాక్కైన కోర్టు.. చర్చనీయాంశమైన తీర్పు..

ఎన్నారై డెస్క్: విపరీతమైన వెన్ను నొప్పికి తాలలేక ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న ఆసుపత్రిని సందర్శించాడు. వైద్యుడి దగ్గరికెళ్లి తన బాధను వివరించాడు. ఈ క్రమంలో వైద్యుడు చేసిన పని వల్ల బాధితుడి నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువైంది. దీంతో అతడు మరో వైద్యుడిని సంప్రదించాడు. అప్పుడే అసలు విషయం తెలిసింది.. ఇంతకీ ఆ డాక్టర్ ఏం చేశారు..? కోర్టుకెళ్లాక ఏం తీర్పునిచ్చింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


ఆపరేషన్ చేశాడు కానీ..

దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి గత కొద్ది రోజులుగా నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆ నొప్పి తీవ్రమైంది. ఇక చేసేదేమీ లేక అతడు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాడు. దీంతో డాక్టర్  అతడికి శస్త్రచికిత్స చేయడంతోపాటు ఇంజక్షన్ థెరపీ చేశాడు. కానీ బాధితుడికి నొప్పి ఏ మాత్రం తగ్గకపోగా.. కాలం గడిచే కొద్ది సమస్య మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మరోసారి వైద్యుడిని కలిశాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థిని పరిశీలించి.. వైద్యుడు అతడికి మరోమారు ఆపరేషన్ చేశాడు. అయినా బాధితుడికి ఉపశమనం లభించలేదు. 



ఇదీ అసలు కథ..

ఇక ఈ డాక్టర్ దగ్గరికెళ్లడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని.. ఆ బాధితుడు మరో వైద్యుడిని సంప్రదించి తన సమస్య వివరించాడు. ఈ క్రమంలో అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు.. సంచలన విషయాలు వెల్లడించాడు. చికిత్సలో భాగంగా మునుపటి వైద్యుడు తప్పుడు ఇంజక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో బాధితుడు అవాక్కయ్యాడు. వెంటనే ఆసుపత్రిపై, తనకు చికిత్స చేసిన డాక్టర్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. బాధితుడికి నష్టపరిహారంగా 8,00,000 దిన్హార్లు(సుమారు రూ.1.66కోట్లు) చెల్లించాలంటూ వైద్యుడిని, ఆసుపత్రిని ఆదేశించింది. ఈ తీర్పు దుబాయ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చూశారుగా.. ఆయనకు సరైన చికిత్స చేసి వెన్ను నొప్పి తగ్గించాల్సిన ఆ డాక్టర్.. తెలిసీ తెలియక వైద్యం చేసి ఇలా అడ్డంగా బుక్కయ్యి.. కోర్టుతో చీవాట్లు పెట్టించుకొని.. భారీ మొత్తంలో ఇలా వదిలించుకోవాల్సి వచ్చింది.


Updated Date - 2022-05-02T15:36:00+05:30 IST