దుబాయిలో ఉచితంగా బస్సు ప్రయాణం.. ఎవరికంటే..

ABN , First Publish Date - 2020-04-06T19:04:26+05:30 IST

కరోనాను నియంత్రించేందుకు దుబాయి ప్రభుత్వం స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని రెండు వారాల పాటు పొడిగించింది. ఈ రెండు వారాల పాటు

దుబాయిలో ఉచితంగా బస్సు ప్రయాణం.. ఎవరికంటే..

దుబాయి: కరోనాను నియంత్రించేందుకు దుబాయి ప్రభుత్వం స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని రెండు వారాల పాటు పొడిగించింది. ఈ రెండు వారాల పాటు అత్యవసర సేవలకు హాజరయ్యే వారు తప్ప.. మిగతా వారు బయటకు రాకూడదు. అయితే అత్యవసర సేవలకు హాజరయ్యే వారికి ఇబ్బందులు తలెత్తకుండా దుబాయి ఆర్టీఏ బస్సులను నడుపుతోంది. పబ్లిక్, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్న 13 రూట్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు బస్సులు తిరగవని అధికారులు స్పష్టం చేశారు. ఈ 13 రూట్లలో 8, 10, 12, ఏ13, 17, 24, సీ01, ఎఫ్18, ఎఫ్21, ఎఫ్34, ఎఫ్43, ఎక్స్23 బస్సులు ప్రతి 30 నిమిషాలకు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవలకు హాజరయ్యే వారందరూ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చని ఆర్టీఏ వెల్లడించింది. అంతేకాకుండా అత్యవసర సేవలకు వెళ్లేవారికి దుబాయి ట్యాక్సీలలో 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అత్యవసర విభాగంలోకి వైద్యులు, ఫార్మసీ వర్కర్లు, ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేసేవారు ముఖ్యంగా రానున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-04-06T19:04:26+05:30 IST