ప్రధాని మోదీకి భారత సంతతి బాలుడి రిపబ్లిక్ డే స్పెషల్ గిఫ్ట్!

ABN , First Publish Date - 2021-01-24T00:54:18+05:30 IST

గల్ఫ్ దేశం దుబాయిలో ఉండే 14 ఏళ్ల భారత సంతతి బాలుడు రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పెషల్ గిఫ్ట్‌ పింపించాడు. కేరళకు చెందిన సరన్ సాయికుమార్ తాను గీసిన ఆరు లేయర్ల మోదీ చిత్రపటాన్ని గణతంత్ర దినోవత్సవం సందర్భంగా ప్రధానికి బహుమానంగా పంపించడం జరిగింది.

ప్రధాని మోదీకి భారత సంతతి బాలుడి రిపబ్లిక్ డే స్పెషల్ గిఫ్ట్!

దుబాయి: గల్ఫ్ దేశం దుబాయిలో ఉండే 14 ఏళ్ల భారత సంతతి బాలుడు రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పెషల్ గిఫ్ట్‌ పింపించాడు. కేరళకు చెందిన సరన్ సాయికుమార్ తాను గీసిన ఆరు లేయర్ల మోదీ చిత్రపటాన్ని గణతంత్ర దినోవత్సవం సందర్భంగా ప్రధానికి బహుమానంగా పంపించడం జరిగింది. మూడు రోజుల పర్యటన కోసం యూఏఈ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌కు గురువారం ఈ పెయింటింగ్‌ను అందజేశాడు. 


'దుబాయిలో అద్భుతమైన పెయింటింగ్ టాలెంట్ గల యువ ఆర్టిస్ట్ సరన్ సాయికుమార్‌ను కలవడం చాలా సంతోషం. అతను అందమైన ఆరు లేయర్ల స్టెన్సిల్ పెయింటింగ్‌ను మన ప్రధాని మోదీకి రిపబ్లిక్ డే గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అతనికి నా బెస్ట్ విషెస్.' అని మురళీధరన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సరన్ నుంచి అతను గీసిన మోదీ చిత్రపటాన్ని తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను కూడా మంత్రి జత చేశారు. 


ఇక పెయింటింగ్‌లో ప్రధాని మోదీ సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) లోగో గల టోపీ పెట్టుకుని సెల్యూట్ చేస్తున్నట్లు ఉన్నారు. సుమారు 6 గంటల పాటు కష్టపడి ఆరు రంగుల లేయర్లతో ఈ చిత్రపటాన్ని రూపొందించినట్లు సరన్ చెప్పాడు. దుబాయిలోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సరన్.. ఇంతకుముందు కూడా మోదీ భారీ చిత్రపటాన్ని గీసి గిఫ్ట్ పంపించాడు. అలాగే వివిధ సందర్భాల్లో దుబాయి రాజుల పెయింటింగ్స్ సైతం గీశాడు. స్టెన్సిల్ ఆర్ట్ పోర్ట్రెయిట్‌లో అద్భుతమైన ప్రతిభ గల సరన్.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి నుంచి ప్రత్యేక ప్రశంస పత్రాన్ని కూడా అందుకున్నాడు.          



Updated Date - 2021-01-24T00:54:18+05:30 IST