ద్వంద్వ ప్రమాణాలు తగదు!

ABN , First Publish Date - 2020-02-27T06:46:24+05:30 IST

కొత్తగా నియమితులైన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైనా మరింత మెరుగైన ఉద్యోగం లభించి, తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తే అప్పటి వరకు పొందిన వేతనం, వారికి శిక్షణ...

ద్వంద్వ ప్రమాణాలు తగదు!

కొత్తగా నియమితులైన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైనా మరింత మెరుగైన ఉద్యోగం లభించి, తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తే అప్పటి వరకు పొందిన వేతనం, వారికి శిక్షణ నిమిత్తం అయిన ఖర్చులను తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయటం సబబు కాదు. ఎందుకంటే, ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చినవే. ఇక వారు కష్టపడి చదివిన చదువుకు, శ్రమకు తమ విద్యార్హతకు తగిన, మెరుగైన ఉద్యోగానికి వెళ్ళటంలో తప్పేముంది? శాసన సభ్యులు సభకు హాజరు అవకుండానే ఎలా వేతనాలు తీసుకుంటున్నారు? సభకు రానందుకు వారి ఎన్నికకు అయిన ఖర్చును కూడా తిరిగి తీసుకుంటారా? ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను ఒకేలా పరిగణించాలి.


ఆర్‌.జి.

Updated Date - 2020-02-27T06:46:24+05:30 IST