డయ్యూ షెడ్యూల్‌ కంప్లీట్‌

అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘రామ్‌ సేతు’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇటీవలె ఊటీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రయూనిట్‌ తాజాగా డయ్యూలో జరిగిన షెడ్యూల్‌ను ముగించింది. అక్షయ్‌ ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఈ చిత్రంలో ఆయన పురాతత్వశాస్త్రవేత్తగా కనిపించనున్నారు. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ బరూచా కథానాయికలు. అభిషేక్‌ శర్మ దర్శకుడు. అరుణా భాటియా, విక్రమ్‌ మల్హోత్రా నిర్మాతలు. తెలుగు నటుడు సత్యదేవ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 


Advertisement