బన్ని ఉత్సవాలు రద్దు

ABN , First Publish Date - 2020-10-24T11:07:59+05:30 IST

హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి రోజున జరిగే మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలను ..

బన్ని ఉత్సవాలు రద్దు

భక్తులు సహకరించాలి


డీఎస్పీ వినోద్‌కుమార్‌

ఆదోని రూరల్‌, అక్టోబరు 23: హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి రోజున జరిగే మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఇస్వీ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నివారణలో భాగంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని, భక్తులు సహకరించాలని కోరారు. ఇప్పటికే దేవరగట్టు పరిసర గ్రామాల ప్రజలకు దీనిపై అవగాహన కల్పించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఉత్సవాల రద్దు విషయం తెలియజేశామని తెలిపారు. 

Updated Date - 2020-10-24T11:07:59+05:30 IST