అమరావతి: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డీఎస్సీ 2008 అభ్యర్థుల కల నెరవేరనుంది. 2,193 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. డీఎస్సీ 2008 పరీక్షల అంశం 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని సురేష్ తెలిపారు. 2014 మేనిఫెస్టోలో డీఎస్సీ 2008 అభ్యర్థుల అంశాన్ని పెట్టి టీడీపీ డీఎస్సీ అభ్యర్థుల్ని మోసం చేసిందని సురేష్ విమర్శించారు.