స్కూల్‌ విద్యార్థులకు డ్రైరేషన్‌

ABN , First Publish Date - 2020-08-10T10:19:28+05:30 IST

కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరవనందున విద్యార్థులకు మధ్యాహ్న భోజన బదులు డ్రై రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వ ..

స్కూల్‌ విద్యార్థులకు డ్రైరేషన్‌

బియ్యం, కోడి గుడ్లు, చెక్కీలు ఇళ్ల వద్దకే సరఫరా


విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరవనందున విద్యార్థులకు మధ్యాహ్న భోజన బదులు డ్రై రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. బియ్యం, గుడ్లు, వేరుశనగ చెక్కీ లను ఆయా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అందజేయాలని స్ప ష్టం చేసింది.  జూన్‌ 12 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు సెలవు రోజులను మినహాయించి మిగిలిన 62 రోజులకు ప్రాథమిక విద్యార్థులకు 6.2 కిలోలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 9.3 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థికి రెండు విడతలుగా 56 కోడిగుడ్లు, 35 చెక్కీలు పంపిణీ చేస్తామని, ఐదో తరగతి విద్యార్థులను ఆరో తరగతికి ప్రమోట్‌ చేసినందున వారికి ఉన్నత పాఠశాల విద్యార్థుల మాదిరిగానే బియ్యం అందజేస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T10:19:28+05:30 IST