డ్రై ఫ్రూట్‌ లడ్డూ

ABN , First Publish Date - 2020-02-22T18:17:31+05:30 IST

ఖర్జూరం - పావు కప్పు, జీడిపప్పు - పావుకప్పు, బాదం - పావుకప్పు, పిస్తా - పావుకప్పు, డ్రై అప్రికాట్స్‌ - ఆరు, డ్రై ఫిగ్స్‌ - నాలుగు, ఎండు కొబ్బరి - రెండు

డ్రై ఫ్రూట్‌ లడ్డూ

కావలసినవి : ఖర్జూరం - పావు కప్పు, జీడిపప్పు - పావుకప్పు, బాదం - పావుకప్పు, పిస్తా - పావుకప్పు, డ్రై అప్రికాట్స్‌ - ఆరు, డ్రై ఫిగ్స్‌ - నాలుగు, ఎండు కొబ్బరి - రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - ఒకటీస్పూన్‌.


తయారీ : ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు బాగా వేగించాలి.  తరువాత పిస్తా వేసి మరో రెండు నిమిషాలు వేగించి వీటన్నింటి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అప్రికాట్స్‌, ఫిగ్స్‌ కాస్త వేడి అయ్యేలా వేగించాలి. ఖర్జూరం, అప్రికాట్స్‌, ఫిగ్స్‌ను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమంలో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి. ఎండుకొబ్బరి, నువ్వులు లడ్డూలపై అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్‌ లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు. 

Updated Date - 2020-02-22T18:17:31+05:30 IST