రక్తహీనత పోవాలంటే...

ABN , First Publish Date - 2020-11-23T05:54:06+05:30 IST

డ్రై అప్రికాట్‌లో ఐరన్‌ ఎక్కువ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో కాపర్‌ ఉంటుంది. కాపర్‌ ఐరన్‌ను గ్రహిస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. పీరియడ్స్‌ సమయంలో మహిళలు డ్రై అప్రికాట్‌ తీసుకుంటే మరీ మంచిది

రక్తహీనత పోవాలంటే...

  1. డ్రై అప్రికాట్‌లో ఐరన్‌ ఎక్కువ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో కాపర్‌ ఉంటుంది. కాపర్‌ ఐరన్‌ను గ్రహిస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. పీరియడ్స్‌ సమయంలో మహిళలు డ్రై అప్రికాట్‌ తీసుకుంటే మరీ మంచిది.
  2. భోజనానికి ముందు డ్రై అప్రికాట్‌ తీసుకుంటే జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. వీటిలో ఉండే అల్కలై యాసిడ్స్‌ను తగ్గిస్తుంది. 
  3. గర్భిణిలు స్వీట్స్‌, స్నాక్స్‌ బదులుగా డ్రై అప్రికాట్‌ తీసుకోవచ్చు. పాలిచ్చే తల్లులు కూడా తీసుకోదగిన ఫ్రూట్‌ ఇది.
  4. ఇందులో ఉండే విటమిన్‌ - ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను తొలగించి కణజాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

Updated Date - 2020-11-23T05:54:06+05:30 IST