'దృశ్యం 2': ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా 'దృశ్యం 2'. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన 'దృశ్యం 2'..అంతకముందు వచ్చిన 'దృశ్యం'కు సీక్వెల్‌గా రూపొందించారు. సీనియర్ హీరోయిన్ మీనా ఇందులో వెంకీ సరసన నటించారు. ఇన్ని రోజులు ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక ఓటీటీలో విడుదలవుతుందా అనే విధంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'దృశ్యం 2'ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు వచ్చే నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వెంకీ గత చిత్రం 'నారప్ప' కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై హిట్ సాధించింది. ఇప్పుడు 'దృశ్యం 2' కూడా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతుంది.  


Advertisement
Advertisement