Abn logo
Sep 21 2020 @ 14:36PM

'దృశ్యం 2'ను స్టార్ట్‌ చేసిన మోహన్‌లాల్‌

Kaakateeya

క్రమంగా షూటింగ్స్‌ ఊపందుకుంటున్నాయి. స్టార్‌ హీరోలు నెమ్మదిగా లొకేషన్స్‌ వైపు అడుగులేస్తున్నారు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కొత్త చిత్రం 'దృశ్యం 2' రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. 2013లో జీతూ జోసెఫ్‌ 'దృశ్యం' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మధ్య తరగతి తండ్రి కుటుంబానికి వచ్చిన సమస్యను ఎంత తెలివిగా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం సెన్సేషనల్‌ విజయాన్ని దక్కించుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మధ్య తరగతి తండ్రిగా మోహన్‌లాల్‌ నటన అద్భుతమంటూ ప్రశంసించనివారు లేదు. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌, తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్‌ నటించారు. సినిమా అన్నీ భాషల్లో సక్సెస్‌ సాధించింది. ఇప్పుడు జీతూ జోసెఫ్‌ దృశ్యం సీక్వెల్‌గా 'దృశ్యం 2'ను తెరకెక్కించబోతున్నారు. తన సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుని షూటింగ్‌ ప్రారంభించుకుందని మోహన్‌లాల్‌ ట్విట్టర్‌ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 



Advertisement
Advertisement
Advertisement