మద్యం మత్తులో ఉన్న Young Lady రోడ్డుపై ఏం చేసిందో చూడండి..!

ABN , First Publish Date - 2022-01-02T17:02:10+05:30 IST

నూతన సంవత్సర వేడుకల్లో బంజారాహిల్స్‌లో ఓ జంట

మద్యం మత్తులో ఉన్న Young Lady రోడ్డుపై ఏం చేసిందో చూడండి..!

హైదరాబాద్ సిటీ : నూతన సంవత్సర వేడుకల్లో బంజారాహిల్స్‌లో ఓ జంట (వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన యువతీ, యువకుడు) హంగామా సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుండగా పోలీసులు కారును ఆపారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయడానికి ప్రయత్నించగా, అడ్డుకున్న ఆ జంట నానా హంగామా చేసింది. అసలు కారు ఆపడానికి మీరెవరు..? అని పోలీసులనే ప్రశ్నించారు. అక్కడ జనం చేరుకోగా వారిని కూడా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఎంత వారించడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా రోడ్డు మీద అరుస్తూనే ఉన్నారు. స్థానికులు వీడియోలను రికార్డు చేసి వైరల్‌ చేశారు.

Updated Date - 2022-01-02T17:02:10+05:30 IST