తుపాకీ పోయిందని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన కానిస్టేబుల్.. అది ఎలా పోయిందో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-02-17T22:40:06+05:30 IST

అతను ఓ కానిస్టేబుల్.. ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు.. డ్యూటీ పూర్తయ్యాక తిరిగి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు..

తుపాకీ పోయిందని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన కానిస్టేబుల్.. అది ఎలా పోయిందో తెలిస్తే షాక్!

అతను ఓ కానిస్టేబుల్.. ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు.. డ్యూటీ పూర్తయ్యాక తిరిగి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.. కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే తన తుపాకీ కనిపించలేదు.. ఎంత వెతికినా దొరకలేదు.. దీంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.. అదే సమయంలో ఓ యువకుడు తుపాకీ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ తన ఆటోలో తుపాకీ మర్చిపోయాడని చెప్పాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మహేష్ శర్మ అనే కానిస్టేబుల్ ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం కొత్వాలీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం డ్యూటీ పూర్తయ్యాక మద్యం సేవించి ఆటోలో రైల్వే స్టేషన్‌కు బయల్దేరాడు. ఆటోలోనే తన రైఫిల్ మర్చిపోయి దిగిపోయాడు. రైల్వే స్టేషన్‌‌లో కాసేపు నిద్రపోయాడు. మత్తు దిగాక లేచి చూసుకుంటే తన రైఫిల్ కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తుపాకీని ఎవరో దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. 


అదే సమయంలో ఆటో డ్రైవర్ ఆ రైఫిల్‌ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ తన రైఫిల్‌ను ఆటోలో మర్చిపోయాడని చెప్పాడు. రైఫిల్ పోయిందని కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లోనే కాకుండా జీఆర్పీ పోలీసులకు కూడా మహేష్ ఫిర్యాదు చేశాడు. రైఫిల్ దొరకడంతో ఆ కానిస్టేబుల్ ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నాడు. 

Updated Date - 2022-02-17T22:40:06+05:30 IST