Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 17 Dec 2021 12:58:30 IST

ఏడేళ్ల కూతుర్ని మర్చిపోయి వెళ్లిపోయిన తాగుబోతు తండ్రి.. రాత్రంతా పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ సీన్

twitter-iconwatsapp-iconfb-icon
ఏడేళ్ల కూతుర్ని మర్చిపోయి వెళ్లిపోయిన తాగుబోతు తండ్రి.. రాత్రంతా పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ సీన్

అతను ఓ తాగుబోతు.. సాయంత్రమైతే చాలు వైన్ షాప్‌ ముందు క్యూ కట్టాల్సిందే.. ఎప్పటిలాగానే బుధవారం కూడా మద్యం సేవించేందుకు బయల్దేరాడు.. చాక్లెట్లు కావాలని కూతురు అడగడంతో ఆ పాపను కూడా తీసుకెళ్లాడు.. ముందు వైన్ షాప్‌ దగ్గరకు వెళ్లి ఫుల్‌గా మద్యం సేవించాడు.. పక్కనే ఆమ్లెట్లు అమ్ముతున్న బండి దగ్గరకు వెళ్లి తిన్నాడు.. ఆ మైకంలో కూతుర్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు.. పాప ఏదని భార్య అడగడంతో అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది.. కానీ, ఎక్కడ వదిలేశాడో మాత్రం గుర్తుకు రాలేదు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


కాన్పూర్‌లోని గోవింద్ నగర్‌లో నివసిస్తున్న నారాయణ్ పచ్చి తాగుబోతు. సాయంత్రమైతే చాలు ఆల్కహాల్ లోపలకు వెళ్లాల్సిందే. బుధవారం సాయంత్రం మద్యం తెచ్చుకునేందుకు నారాయణ్ బయల్దేరాడు. చాక్లెట్లు కొని పెట్టమని ఏడేళ్ల కూతురు అడగడంతో ఆ బాలికను కూడా తీసుకెళ్లాడు. ముందు మద్యం షాప్ దగ్గరకు వెళ్లి తాగేశాడు. పక్కనే ఉన్న బడ్డీ దగ్గరకు వెళ్లి ఆమ్లెట్లు తిన్నాడు. అక్కడే కూతుర్ని వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. కూతురు ఏదని భార్య అడిగితే అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. అయితే ఆ పాపను ఎక్కడ వదిలేశాడో అతనికి గుర్తుకు రాలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. 


దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 44 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వైన్ షాప్‌నకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ గాలించారు. అయినా పాప ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం ఇద్దరు వృద్ధ దంపతులు ఆ పాపను తీసుకుని స్టేషన్‌కు చేరడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పాప తమ బడ్డీ దగ్గరే ఒంటరిగా ఉండడంతో రాత్రి ఇంటికి తీసుకెళ్లామని వారు చెప్పారు. ఆ పాప ఆ వృద్ధ దంపతులను వదిలి తన తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడలేదు. చివరకు పోలీసులు నచ్చ చెప్పి పంపించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.