రాత్రి 11 గంటల సమయం.. తప్పతాగిన యువతి.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుమీద..

ABN , First Publish Date - 2021-08-05T18:42:09+05:30 IST

తప్పతాగి అక్కడకు వచ్చిన యువతి నడిరోడ్డు మీదే విన్యాసాలు చేసింది..

రాత్రి 11 గంటల సమయం.. తప్పతాగిన యువతి.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుమీద..

రాత్రి 11 గంటల సమయం.. ఆ సమయంలోనూ వాహనాలతో బిజీగా ఉండే రోడ్డు.. తప్పతాగి అక్కడకు వచ్చిన యువతి నడిరోడ్డు మీదే విన్యాసాలు చేసింది.. రోడ్డు మీద పడుక్కొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది.. పోలీసులను చూసి అక్కణ్నుంచి పారిపోయింది.. పుణెలోని హిరాబాగ్ చౌక్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. 


మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువతి తప్ప తాగి మతిస్థిమితం కోల్పోయి పుణెలోని హిరాబాగ్ చౌక్ రోడ్డు మీదకు వచ్చింది.. అక్కడ నడిరోడ్డు మీద కూర్చుని వచ్చి పోయే వాహనాలకు అడ్డుగా నిలిచింది.. అనంతరం అక్కడే పడుక్కుంది.. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారి రాకను గమనించిన యువతి అక్కణ్నుంచి జారుకుంది.. ఆమె చేష్టలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో వైరల్‌గా మారింది.. ఆ వీడియోలోని యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  



Updated Date - 2021-08-05T18:42:09+05:30 IST