తాగి తోలారో వెంటనే ‘రద్దు’!

ABN , First Publish Date - 2022-01-20T07:12:43+05:30 IST

: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి లైసెన్స్‌ రద్దు చేసే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. తాగి వాహనం తోలుతూ పోలీసులకు పట్టుబడితే పత్రాలను స్వాధీనం చేసుకొని.. రవాణా శాఖ..

తాగి తోలారో వెంటనే ‘రద్దు’!

లైసెన్స్‌ రద్దు ప్రక్రియ ఇక వేగవంతం.. ఇందుకు ప్రత్యేకంగా యాప్‌ 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి లైసెన్స్‌ రద్దు చేసే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. తాగి వాహనం తోలుతూ పోలీసులకు పట్టుబడితే పత్రాలను స్వాధీనం చేసుకొని.. రవాణా శాఖ అధికారులకు పంపడం.. వాటిని వారు పరిశీలించిన మీదట లైసెన్స్‌ రద్దు చేయడం ఇలా సుదీర్ఘ ప్రక్రియకు చెక్‌ పడనుంది. ఇందుకోసం ఓ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ వచ్చేసింది.  డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి.. జరిమానాలు కట్టి.. చివరికీ జైలు శిక్ష కూడా అనుభవించినా తాగి రోడ్లపైకి వాహనాలతో వచ్చేవారికి నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు. ఇందుకుగాను హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ పోలీసులు కొత్త తరహాలో ముందుకొస్తున్నారు. తాగి వాహనం నడిపిన వారి డ్రైవింగ్‌ లైసెన్సును క్షణాల్లో కేన్సిల్‌ చేసే విధంగా ఓ యాప్‌ను రూపొందించారు. దానిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న అధికారులకే పూర్తి అధికారాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు వారు, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే.. సదరు వ్యక్తి వివరాలను యాప్‌లో ఎంటర్‌ చేస్తారు. ఆ వివరాలు వెంటనే రవాణా శాఖాధికారులకు చేరుతాయి. అక్కడ వెంటనే లైసెన్సు రద్దవుతుంది. లైసెన్సు రద్దు వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో ట్రాఫిక్‌ శాఖతో పాటు రవాణా శాఖలోకి అందుబాటులోకి వచ్చేస్తాయి. 

Updated Date - 2022-01-20T07:12:43+05:30 IST