కావలసిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు- 20, టొమాటో - కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్టు- స్పూను, కొత్తిమీర తరుగు- 2 స్పూన్లు, పల్లీలు- మూడు స్పూన్లు, నువ్వులు- రెండు స్పూన్లు, గసగసాలు- రెండు స్పూన్లు, ఎండు కొబ్బరి- రెండు స్పూన్లు, ఆవాలు- స్పూను, కరివేపాకు- రెండు మట్టలు, గరం మసాలా- స్పూను, పసుపు- అరస్పూను, కారం- స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా పాన్లో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు ఒకటి తర్వాత ఒకటి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఈ మసాలాకి నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. పెద్ద బాణలిలో కాస్త నూనె వేసి ఆవాలు, కరివేపాకును చిటపటలాడించాలి. ఉల్లిముక్కలూ, అల్లం, వెల్లుల్లి పేస్టూ వేయాలి. ఉల్లి రంగు మారాక పసుపు, కారం, గరం మసాల జతచేయాలి. ఘమఘమ లాడుతుంటే టొమాటో ముక్కల్ని కూడా కలపాలి. కాస్త మగ్గాక మసాలా పేస్టు చేర్చాలి. ములక్కాడలు కూడా వేసి, కప్పు నీళ్లు పోసి అన్నిటినీ కలిపి పావు గంట పాటు మూత పెట్టి ఉడికించాలి. కొత్తిమీర తరుగు వేసి దించితే ములక్కాడల కూర సిద్ధం.