Drugs Seized : ముంబైలో రూ.1400 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

ABN , First Publish Date - 2022-08-04T22:32:41+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) భారీ డ్రగ్స్(Drugs) రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఏకంగా 700 కేజీల నిషేధిత మెఫోడ్రొన్‌(mephedrone )ను యాంటీ-నార్కోటిక్ సెల్(ANC) అధికారులు గురువారం సీజ్ చేశారు.

Drugs Seized : ముంబైలో రూ.1400 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) భారీ డ్రగ్స్(Drugs) రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఏకంగా 700 కేజీల నిషేధిత మెఫోడ్రొన్‌(mephedrone)ను యాంటీ-నార్కోటిక్ సెల్(ANC) అధికారులు గురువారం సీజ్ చేశారు. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.1400 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఒక ఔషధ తయారీ కంపెనీ యూనిట్‌లో సోదాలు చేస్తుండగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయని వివరించారు. 


సమాచారం ఆధారంగా ఏఎన్‌సీ అధికారులు కంపెనీ ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు. భారీ మొత్తంలో నిషేధిత మెఫెడ్రొన్ లభ్యమైందని అన్నారు. కంపెనీ యూనిట్‌లో దీనిని తయారు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. కాగా ఈ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి ముంబైలో నలుగురు, నలసొపారాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు వివరించారు. కాగా ముంబై సిటీ పోలీసులకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డ ఘటనల్లో ఇదొకటని చెప్పారు.


కాగా మెఫెడ్రొన్‌ను ‘మియోవ్ మియోవ్’ లేదా ఎండీ అని కూడా వ్యవహరిస్తారు. వ్యక్తుల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపే దీనిని ఎన్‌డీపీఎస్ (డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ కింద నిషేధించారు.

Updated Date - 2022-08-04T22:32:41+05:30 IST