Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 09:48:28 IST

కొత్తగా పప్పి స్ట్రా..

twitter-iconwatsapp-iconfb-icon
కొత్తగా పప్పి స్ట్రా..

- డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పంజాబీలు

- ఇద్దరి అరెస్ట్‌

- రూ. 15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ: పప్పి స్ట్రా కాన్సంట్రెట్‌ అనే కొత్తరకం మాదక ద్రవ్యాన్ని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 900 గ్రాముల పప్పి స్ట్రా కాన్సంట్రెట్‌ సీడ్స్‌, రూ. 1,44,800 నగదు,  కారు, మూడు ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ వెయింగ్‌ మిషన్‌ సహా రూ. 15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన జగ్‌తార్‌ సింగ్‌ 12 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి, మేడ్చల్‌ పరిధి కండ్లకోయ టోల్‌ప్లాజా సమీపంలో సందీప్‌ పంజాబ్‌ దాబా పేరుతో హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఆ హోటల్‌కు వచ్చే కొందరు పంజాబ్‌కు చెందిన డ్రైవర్స్‌తో అతడికి స్నేహం ఏర్పడింది. 


పంజాబ్‌లో విరివిగా..

నగరంలో డ్రగ్స్‌కు డిమాండ్‌ ఉందని గుర్తించిన జగ్‌తార్‌ సింగ్‌ పంజాబ్‌లో విరివిగా లభించే మాదకద్రవ్యం పప్పి స్ట్రాను నగరంలో సరఫరా చేయాలని భావించాడు. హోటల్లో పని చేస్తున్న జైమాల్‌ సింగ్‌ సహకారంతో పంజాబ్‌లో తనకు పరిచయం ఉన్న డ్రైవర్ల ద్వారా కారులో పప్పిస్ట్రాను తెప్పించేవాడు. దాన్ని నగరానికి చెందిన కొంతమందికి అలవాటు చేసి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. గురువారం అర్ధరాత్రి 11 గంటలకు కీసర పోలీసులు లేక్‌ వ్యూ దాబా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.