పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో రంగంలోకి నార్కోటిక్ వింగ్

ABN , First Publish Date - 2022-04-03T22:37:43+05:30 IST

జంటనగరాల్లో డ్రగ్స్ కలలకం రేపిన పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు.

పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో రంగంలోకి నార్కోటిక్ వింగ్

హైదరాబాద్: జంటనగరాల్లో డ్రగ్స్ కలలకం రేపిన పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీ చౌహన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.డ్రగ్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని నార్కోటిక్ అధికారులు వినియోగిస్తున్నారు. కాగా  ఫుడింగ్ మింక్ పబ్‌లో క్లూస్‌ టీం సోదాలు నిర్వహించింది. ఈసందర్భంగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.అలాగే క్లూస్ టీం శాంపిల్ సేకరిస్తున్నారు. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.


కాగా మరొక టీం సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.డ్రగ్స్ సప్లై చేసిన యువకులపైనా పోలీసుల ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ 142 మందిలో రేపు కొందరిని విచారించే అవకాశం వుంది. 

Updated Date - 2022-04-03T22:37:43+05:30 IST