Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 30 2021 @ 15:35PM

ఈడీ విచారణకు హాజరుకానున్న పూరి జగన్నాథ్

హైదరాబాద్: సినీ తారల డ్రగ్స్ కేసులో మంగళవారం నుంచి ఈడీ విచారణ మొదలవుతుంది. ముందుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు హాజరవుతారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ జరిపింది. 62 మందిని ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో లబ్దిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలు చేసింది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేయాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి రేపటి నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ తారలను ఈడీ దశలవారీగా విచారించనుంది. ఈ విచారణలో ఎలాంటి నిజాలు వెలికి వస్తాయో చూడాలి. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement