ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంలో కొత్త కోణం

ABN , First Publish Date - 2022-04-03T23:11:30+05:30 IST

ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంలో కొత్త కోణం

హైదరాబాద్‌: ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కునాల్, వంశీధర్‌రావు చాట్‌లో వీఐపీలున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పెడ్లర్లతో కునాల్‌కు లింకులున్నట్లు సమాచారం. బ్రో, స్టఫ్‌, సోడా, కూల్ లాంటి కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాగానే డ్రగ్స్‌ సేవిస్తున్నవారిని కునాల్ అలెర్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఫుడింగ్ మింక్ పబ్‌లో క్లూస్‌ టీం సోదాలు చేస్తోంది. విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి.. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ సప్లై చేసిన యువకులపై పోలీసుల ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ 142 మందిలో సోమవారం కొందరిని విచారించే అవకాశం ఉంది.

Updated Date - 2022-04-03T23:11:30+05:30 IST