చైనా యుద్ధనౌకను తరిమికొట్టాం: ఫిలిప్పీన్స్

ABN , First Publish Date - 2021-07-20T02:49:14+05:30 IST

దక్షిణచైనాలోని వివాదాస్పద జలాల్లో ప్రవేశించిన చైనా యుద్ధనౌకను తరిమికొట్టామని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది.

చైనా యుద్ధనౌకను తరిమికొట్టాం: ఫిలిప్పీన్స్

న్యూఢిల్లీ: దక్షిణచైనాలోని వివాదాస్పద జలాల్లో ప్రవేశించిన చైనా యుద్ధనౌకను తరిమికొట్టామని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. ముందుకు రావద్దని స్పీకర్ల ద్వారా హెచ్చరించడంతో చైనా నౌక వెనుదిరిగిందని పేర్కొంది. ఇటీవల కాలంలో చైనా, ఫిలీప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చేపల వేట పేరుతో చైనా ఇటీవల భారీ ఎత్తున ఫిలిప్పీన్స్ జలాల్లో నావలను మోహరిస్తోందంటూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి జలాల్లోకి చైనా యుద్ధనౌక ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-07-20T02:49:14+05:30 IST