H-1B Visa: అమెరికా కంపెనీలు చెప్పినట్టే జరిగింది..!

ABN , First Publish Date - 2022-02-08T03:00:25+05:30 IST

‘‘H-1B వీసా కారణంగా అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకు కాకుండా పోతున్నాయి..’’ అగ్రరాజ్యంలో గతంలో వినబడ్డ మాటలు ఇవి. కానీ..అక్కడి కంపెనీలు మాత్రం ఈ వాదనను అప్పుడే ఖండించాయి. హెచ్-1బీ వీసాదారుల స్థానాన్ని భర్తీ చేయగల నిపుణులైన అమెరికన్లు తగిన సంఖ్యలో లేరని ఘంటాపథంగా చెప్పాయి. అయితే.. కంపెనీలు చెప్పిందే నిజమని..

H-1B Visa: అమెరికా కంపెనీలు చెప్పినట్టే జరిగింది..!

ఇంటర్నెట్ డెస్క్: ‘‘H-1B వీసా కారణంగా అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకు కాకుండా పోతున్నాయి..’’ అగ్రరాజ్యంలో కొందరు గతంలో అన్న మాటలు ఇవి. కానీ..అక్కడి కంపెనీలు మాత్రం ఈ వాదనను అప్పుడే ఖండించాయి. హెచ్-1బీ వీసాదారుల స్థానాన్ని భర్తీ చేయగల నిపుణులైన అమెరికన్లు తగిన సంఖ్యలో లేరని ఘంటాపథంగా చెప్పాయి. అయితే.. కంపెనీలు చెప్పిందే నిజమని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) తాజా నివేదిక రుజువు చేసింది. 


ఈ నివేదిక ప్రకారం.. అమెరికాలో 2019లో 1,9 లక్షల హెచ్-1బీ వీసాలు జారీ అయ్యాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.25 లక్షలకు పడిపోగా, కరోనా దెబ్బకు 2021 ఈ సంఖ్య ఏకంగా 65 వేలకు చేరుకుంది. 2021లో కోటా ప్రకారం హెచ్-1బీ వీసాలు జారీ చేసేందుకు ప్రభుత్వం రెండు మార్లు లాటరీ నిర్వహించాల్సి వచ్చింది కూడా!  మరి హెచ్-1బీ వీసాదారుల స్థానాన్ని అమెరికా పౌరులు ఆశించిన స్థాయిలో భర్తీ చేశారా అంటే లేదనే చెబుతోంది ఈ నివేదిక. దీనికి బదులుగా.. కంపెనీల్లో ఖాళీల సంఖ్య పెరిగినట్టు బయటపడింది. ‘‘హెచ్-1బీ వీసాల సంఖ్య తగ్గించినంత మాత్రాన స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనేందుకు, లేదా అమెరికా వర్శిటీల్లో చదువుకున్న అమెరికన్లలో నిరుద్యోగ రేటు పడిపోతుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని ఎన్ఎఫ్ఏపీలోని పరిశోధకురాలు మేడలిన్ జావడ్నీ వ్యాఖ్యానించారు.  

Updated Date - 2022-02-08T03:00:25+05:30 IST