Pakistan: భారత ఎంబసీపై డ్రోన్ కలకలం

ABN , First Publish Date - 2021-07-02T19:04:18+05:30 IST

ఆదివారం తెల్లవారుజామున జమ్మూ ఐఎఎఫ్ స్టేషన్‌లో డ్రోన్ల సాయంతో రెండు బాంబులతో దాడికి యత్నించారు. డ్రోన్ల సహాయంతో వైమానిక దళం పై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత రత్నుచక్-కలుచక్ స్టేషన్ వద్ద

Pakistan: భారత ఎంబసీపై డ్రోన్ కలకలం

ఇస్లామాబాద్: జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై జూన్ 27న మొదటిసారి డ్రోన్లతో దాడి జరిగింది. అనంతరం జమ్మూలో వరుసగా డ్రోన్ల కలకలం ఆగడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న ఇండియన్ హై కమిషన్ కాంపౌండ్‌లో డ్రోన్ కనిపించినట్లు సమాచారం. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే డ్రోన్ల సంచారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నట్లు సమాచారం.


ఆదివారం తెల్లవారుజామున జమ్మూ ఐఎఎఫ్ స్టేషన్‌లో డ్రోన్ల సాయంతో రెండు బాంబులతో దాడికి యత్నించారు. డ్రోన్ల సహాయంతో వైమానిక దళం పై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత రత్నుచక్-కలుచక్ స్టేషన్ వద్ద రెండు డ్రోన్లు తిరగడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యి 22 రౌండ్లు కాల్పులు జరిపాయి. మంగళవారం కూడా సుమ్మవాన్ సైనిక ప్రాంతంతో సహా జమ్మూలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్లు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. జమ్మూలోని సైనిక శిబిరాలు సమీపంలో డ్రోన్లు ప్రత్యక్షం కావడంతో సైన్యం అలర్ట్ అయింది.

Updated Date - 2021-07-02T19:04:18+05:30 IST