త్వరలో డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ

ABN , First Publish Date - 2021-12-06T07:10:00+05:30 IST

దేశ సరిహద్దుల్లో డ్రోన్ల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ విధ్వంసక (యాంటీ డ్రోన్‌)...

త్వరలో డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ

బీఎ్‌సఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకలో అమిత్‌ షా

జైసల్మేర్‌, డిసెంబరు 5: దేశ సరిహద్దుల్లో డ్రోన్ల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ విధ్వంసక (యాంటీ డ్రోన్‌) టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇది త్వరలోనే భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎఫ్‌) 57వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. 1965లో బీఎఎ్‌సఎఫ్‌ ఏర్పాటైన తర్వాత ఇన్నేళ్లలో సరిహద్దుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బీఎ్‌సఎఫ్‌, డీఆర్‌డీవో, ఎన్‌ఎ్‌సజీ సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. ‘‘ఒకదేశం సురక్షితంగా ఉన్నపుడే అభివృద్ధి చెందుతుంది. మీరు (బీఎ్‌సఎఫ్‌) దేశ భద్రతకు భరోసా ఇస్తున్నారు. తద్వారా మా దేశం సురక్షితంగా ఉందని ప్రపంచానికి చాటుతున్నారు’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. దేశ భద్రతకోసం 50 వేల మంది జవాన్లను కొత్తగా నియమించామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-12-06T07:10:00+05:30 IST