కరోనా బాధితులకు డ్రోన్‌ సేవలు

ABN , First Publish Date - 2021-05-07T09:48:50+05:30 IST

శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రాన్ని (షార్‌) అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇస్రో డ్రోన్‌లను వినియోగిస్తోంది

కరోనా బాధితులకు డ్రోన్‌ సేవలు

శ్రీహరికోట (సూళ్లూరుపేట), మే 6: శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రాన్ని (షార్‌) అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇస్రో డ్రోన్‌లను వినియోగిస్తోంది. దీనికోసం శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని షార్‌ ఉద్యోగుల కాలనీల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. ఈ ట్రయల్‌ రన్‌లో భాగంగా కరోనాబారినపడి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారికి మందులు, కూరగాయలు డ్రోన్‌ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గరుడ ఏరోస్పేస్‌ కంపెనీ సహకారంతో ఈ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో డ్రోన్‌ల వినియోగాన్ని కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. కాగా, శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని షార్‌ ఉద్యోగుల కాలనీల్లో వందలాది మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు షార్‌లో 30 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం సూళ్లూరుపేటలోని ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున షార్‌ ఆస్పత్రిలో సీనియర్‌ టెక్నీషియన్‌, షార్‌ డ్రైవర్‌ తల్లి మృతి చెందారు.

Updated Date - 2021-05-07T09:48:50+05:30 IST