Abn logo
Feb 22 2020 @ 04:12AM

అభ్యంతరకర చిత్రీకరణలు తప్పే: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

తుళ్లూరు: డ్రోన్‌ కెమెరాలతో అభ్యంతరకర చిత్రీకరణలు తప్పేనని, రైతులు చేసే ప్రశాంతమైన ధర్నాలు, నిరసనలకు పోలీసులు అడ్డురారని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల గోడు తెలుసు కాబట్టే పోలీసులు సామరస్యంగా  ఉన్నారని అన్నారు. అయితే చట్టాన్ని అతిక్రమించి రోడ్డు మీదకొచ్చి గంటల తరబడి  ధర్నాలు చేస్తే కేసులు పెట్టక తప్పదని చెప్పారు. కృష్ణాయపాలెంలో తహశీల్దార్‌ని అడ్డుకున్నందుకు, హోం మినిస్టర్‌, డీజీపీ వస్తున్న సమయంలో ట్రాక్టర్‌ను అడ్డుపెట్టినందుకు కొందరిపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే పెదపరిమిలో ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న కేసులో అయిదుగురిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. గురువారం డ్రోన్‌ చిత్రీకరణ సమయంలో ఆపరేట్‌ చేస్తున్న కానిస్టేబుల్‌పై  దౌర్జన్యం చేసిన వారిపై కూ డా కేసులు నమోదు చేశామన్నారు. అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరిస్తే ఎవరైనా శిక్షార్హులేనన్నారు. రైతు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శరత్‌బాబు, తనపై కూడా కేసు రిజిస్టర్‌ అయినట్టు డీఎస్పీ తెలిపారు. జేఏసీ నాయకుడు పువ్వా డ సుధాకర్‌ రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు కాబట్టే అరెస్టు చేస్తున్నట్టు చెప్పామన్నా రు.  ఈ తరువాత మాట మార్చిన మరో నాయకుడు శ్రీనివాస్‌ కుల ప్రస్తావన తెచ్చి డ్రోన్‌తో పోలీసులు అభ్యంతరకర చిత్రీకరణలు చేస్తున్నట్టు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement