Abn logo
Jan 25 2021 @ 00:59AM

సంస్థ నమ్మకాన్ని నిలబెట్టేది డ్రైవర్లే: డీవీఎం

ఆదిలాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగులు

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 24: ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సురక్షితం, సుఖ వంతమైనదని, సంస్థ నమ్మకాన్ని నిలబెట్టేది డ్రైవర్లేనని ఆదిలాబాద్‌ డీవీఎం రమేష్‌ అన్నారు. ఆదివారం డ్రైవర్స్‌ డేను పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బస్‌ డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్ట ణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది. ఈ ర్యాలీలో ఏఎంవీఐ మహేష్‌తో పాటు ట్రాఫిక్‌ సీఐ గంగాధర్‌ పాల్గొని డ్రైవర్లకు గులాబీ పువ్వు అందిస్తూ డ్రైవర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీవీఎం రమేష్‌ మాట్లాడుతూ విధినిర్వహణలో డ్రైవర్లు ఏకాగ్రత, మానసికంగా దృడంగా ఉంటూ మనో ధైర్యంతో ప్రయాణికులకు గమ్య స్థానాలకు చేర్చి వారి మన్ననలు పొందాలన్నారు. ప్రజా రవాణా రంగంలో ఆర్టీసీకి మంచి పేరు ఉందని ఈ నమ్మకాన్ని మరింత నిలబెట్టేలా డ్రైవర్లు నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డిపో మేనేజర్‌ జనార్దన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ కల్ప, రిజర్వేషన్‌ ఇన్‌చార్జీ సయ్యద్‌ అహ్మద్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ ఆర్టీసీ డిపో కార్మికులు, ఉద్యోగుల ఆధ్వ ర్యంలో ఆదివారం డ్రైవర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. డిపో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ శకుంతల రాజన్న, టీఐటూ జనార్దన్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించి ప్రయాణికులకు సేవలు అందించాలన్నారు. డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు సెల్‌పోన్‌ మాట్లాడవద్దని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్నారు. రోడ్డు వాహన దారులను గౌరవించాలని సూచించారు.

Advertisement
Advertisement