డ్రైవర్‌ నిర్లక్ష్యమే ముంచింది!

ABN , First Publish Date - 2020-11-01T07:01:01+05:30 IST

గోకవరం మండలం తంటికొండ శ్రీవెంక టేశ్వరస్వామి కొండపై జరిగిన ఘోర ప్రమాదానికి వ్యాన డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

డ్రైవర్‌ నిర్లక్ష్యమే ముంచింది!

  •  తంటికొండ  ప్రమాద ఘటనలో అతడిదే తప్పిదం
  •  సీసీ కెమెరాలో కనిపిస్తున్న దృశ్యాలు

గోకవరం, అక్టోబరు31: గోకవరం మండలం తంటికొండ శ్రీవెంక టేశ్వరస్వామి కొండపై జరిగిన ఘోర ప్రమాదానికి వ్యాన డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇంటికెళ్లే తొందరలో డ్రైవర్‌ చేసిన తప్పిదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. ఈ విష యాలన్నీ ‘ఆంధ్రజ్యోతి’ చేతికి చిక్కిన సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టం గా కనిపించడంతోపాటు పోలీసులు కూడా ధ్రువీకరిస్తున్నారు. పెళ్లి తంతు పూర్తవ్వడంతో పెళ్లి బృందం తిరిగి పయనమయ్యేందుకు వారి వాహనాలను పార్కింగ్‌ చేసిన ప్రదేశానికి చేరుకొన్నారు. ఆ సమయంలో పెళ్లికొచ్చిన బంధువుల్లో ఒకరు వెంట తీసికొచ్చిన పెట్టెని డ్రైవర్‌ తన సీటులోంచి కిందకు దిగి వ్యాన టాప్‌ మీద పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పటికే వ్యాన టైర్ల కింద అడ్డుగా ఉంచిన రాళ్లు తీసివేయడంతో వాహనం ఎత్తు నుంచి దిగువకు (మెట్ల వైపునకు) పరుగులు తీసినట్టు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న మిగిలిన బంధువులు వ్యానను నిలవరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదస్ధలి నుంచి వ్యాన పల్టీలు కొట్టిన ప్రాంతానికి బంధువులు ఆర్తనాదాలు చేస్తూ పరిగెత్తుకుని వెళ్లేసరికే ఐదుగురు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు రాజమ హేంద్రవరం, కాకినాడల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

  • కొండపైకి నాలుగు, మూడు చక్రాల వాహనాలకు అనుమతి నిలిపివేత
  • కొండపై నేడు మహా సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు

తంటికొండ గుడిపైకి నాలుగు, మూడు చక్రాల వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. వ్యాన ప్రమాదం నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదే శాల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు దేవస్థానం ఈవో పి. కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. దీంతో ఆలయం పైకి సంబంధింత వాహనాలు ప్రవేశించకుండా ఘాట్‌ రోడ్డును అధికారులు కర్రలతో మూసేశారు. ఘాట్‌రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని, అయితే ఆలయంలో నిత్యం జరిగే కార్యక్రమా లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. శనివారం స్వామివారిని సుమారు 500 మంది భక్తులు దర్శించునున్నట్టు ఈవో తెలిపారు. కాగా వ్యాన ప్రమాదం దోషాన్ని తొలగించేందుకు ఆదివారం  ప్రత్యే క పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలోభాగంగా స్వామివారి సన్నిధిలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలుచేసి, స్వామివారికి, అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు జరపడంతోపాటు ప్రాయశ్చిత్తహోమం, మహా సుదర్శన హోమం నిర్వహిస్తునట్టు ఈవో కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-11-01T07:01:01+05:30 IST