భోపాల్(మధ్యప్రదేశ్)లోని పిప్లానీ ప్రాంతంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థినికి మ్యాజిక్ వాహనంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆ వాహన డైవర్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారు నడుపుతున్న వాహనంలో ప్రయాణిస్తున్న ఆ విద్యార్థినిపై అభ్యంతరకర కామెంట్లు చేశారు. ఆ యువతి టాక్సీ ఛార్జీ చెల్లించబోగా, వారు డబ్బులొద్దు... ఫోన్ నంబర్ ఇస్తే చాలు అని అన్నారు. ఈ విషయమై ఆ యవతి పిప్లానీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.
పిప్లానీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆనంద్‌నగర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఆర్టీ కాలేజీలో బీఈ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆనంద్‌నగర్ నుంచి బీమా ఆసుపత్రి వరకూ వచ్చేందుకు మ్యాజిక్ వాహనం ఎక్కింది. ఆ సమయంలో వాహనంలో ఢ్రైవర్తో సహా ఇద్దరు యువకులు ఉన్నారు. ఆనంద్‌నగర్ నుంచి వాహనం కొంత దూరం వెళ్లాక... వాహనంలోని ఇద్దరు యువకులు ఆమెను ఉద్దేశించి అశ్లీల కామెంట్లు చేయసాగారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోలేదు. బీమా ఆసుపత్రి రాగానే ఆమె వాహనం దిగి డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వబోయింది. అయితే డ్రైవర్ డబ్బులకు బదులు ఫోన్ నంబర్ ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వారు ఆమె చేతిని పట్టుకున్నారు. దీంతో ఆమె గట్టిగా ఆరిచింది. ఆమెను గమనించిన చుట్టుపక్కలవారు అక్కడికి రావడంతో ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.