Sep 28 2021 @ 12:50PM

drishyam 2 : అమెజాన్ ప్రైమ్ లో విడుదల?

విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. మలయాళ సూపర్ హిట్ ‘దృశ్యం’ ఆధారంగా రూపొందిన ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా మంచి సక్సెస్ సాధించింది. మిగతా భాషల్లోనూ సూపర్ హిట్టైంది. ఇటీవలే ‘దృశ్యం’ మలయాళ మూవీకి సీక్వెల్ గా ‘దృశ్యం 2’ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ మూవీ మొదటి భాగాన్నిమించి సక్సెస్ అవడంతో.. తెలుగులో కూడా ‘దృశ్యం 2’ చిత్రం రూపొందింది. ఒరిజినల్ వెర్షన్ ను రూపొందించిన జీతు జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. అతి తక్కువ టైమ్ లో టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసుకొని సెన్సార్ సర్టిఫికెట్  కూడా పొందిన ఈ సినిమాని  ఓటీటీలో విడుదల చేస్తారని గతంలో టాక్ వినిపించింది. ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ కే నిర్మాతలు మొగ్గిచూపిస్తున్నారని వార్తలు వినిపించాయి. 

అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘నారప్ప’ మాదిరిగానే ‘దృశ్యం 2’ సినిమాను కూడా  అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతల ఆలోచన గా తెలుస్తోంది. దసరా తర్వాత ‘దృశ్యం 2’ స్ట్రీమ్ కానుందని సమాచారం.  మొదటి భాగం ఎండ్ అయిన దగ్గర నుంచి రెండో భాగం మొదలవుతుంది. కేబుల్ ఆపరేటర్ రాంబాబు థియేటర్ ఓనర్ అయి.. పాత కేసును తిరగతోడిన పోలీసుల బారి నుంచి తెలివిగా ఎలా తప్పించుకున్నాడు అనే కథాశంతో ‘దృశ్యం 2’ రూపొందింది. మరి ఈ మూవీ నిజంగానే ఓటీటీలో విడుదలవుతుందో లేదో చూడాలి.