జిల్లా ప్రాజెక్టులకు ‘డ్రిప్‌’ తోడ్పాటు

ABN , First Publish Date - 2022-05-19T07:02:05+05:30 IST

జిల్లాలోని ప్రఽఽధాన సాగునీటి ప్రాజెక్టులకు డ్రిప్‌ (డ్యామ్‌ రిహాబిటేషన్‌ అండ్‌ ఇప్రూమెంట్‌ ప్రాజెక్ట్‌) ద్వారా మంజూరు కాబోతున్న నిధులువరంగా మారబోతున్నాయి.

జిల్లా ప్రాజెక్టులకు ‘డ్రిప్‌’ తోడ్పాటు
కడెం ప్రాజెక్టు

గడ్డెన్న, స్వర్ణప్రాజెక్ట్‌లకు రూ.22 కోట్లు మంజూరు

ఎఫ్‌డీఆర్‌ కింద రూ.11 కోట్లు ..

డ్యామ్‌ సెఫ్టీకమిటీ పర్యటనతో సాగునీటిపై చిగురిస్తున్న ఆశలు 

జిల్లాలో అదనపు ఆయకట్టు విస్తరణకు అవకాశాలు 

నిర్మల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రఽఽధాన సాగునీటి ప్రాజెక్టులకు డ్రిప్‌ (డ్యామ్‌ రిహాబిటేషన్‌ అండ్‌ ఇప్రూమెంట్‌ ప్రాజెక్ట్‌) ద్వారా మంజూరు కాబోతున్న నిధులువరంగా మారబోతున్నాయి. ఇటీవలే డ్రిప్‌ పరిధిలో ఎంపిక చేసే ప్రాజెక్ట్‌లను డ్యామ్‌సెఫ్టీ కమిటీ సభ్యులు సందర్శించి ఆ ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకున్నారు. ప్రాజెక్టుల ఆనకట్టలు, గేట్ల నిర్వహణ, కాలువలు తదితర అంశాలను డ్యాం సెఫ్టీ అధికారులు సీరియస్‌గా పరిశీలించారు. ఈ అధికారుల నివేదికల ఆధా రంగా కేంద్రప్రభుత్వం డ్రిప్‌ పథకం కింద జిల్లాలోని గడ్డెన్నవాగు, స్వర్ణప్రాజెక్ట్‌లకు అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ మరమత్తుల కోసం రూ.9 కోట్లు, స్వర్ణవాగు మరమత్తుల కోసం రూ.13 కోట్లను మంజూరు చేసేందుకు డ్రిఫ్‌ సిఫారసు చేసింది. దీంతో కేంద్రప్రభుత్వం ద్వారా నిధులు కొద్దిరోజుల్లోనే ఇరిగేషన్‌ శాఖకు చేరనున్నాయి. అలాగే జిల్లాలో ఓ ఆండ్‌ యం, ఎఫ్‌డీఆర్‌ కింద దాదాపు 102 పనులకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఓఅండ్‌యం కింద 68 పనులకు గానూ రూ. 6.88 కోట్లు, ఎఫ్‌డీఆర్‌ కింద 34 పనులకు గానూ రూ. 439.94 లక్షలను కేటాయించనున్నారు. మొత్తం 1128.42 లక్షలను ఇరిగేషన్‌ శాఖ ఎఫ్‌డీఆర్‌ కింద నిధులు విడుదల చేయనున్న కారణంగా జిల్లాలోని ప్రఽధానప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆధునికీకరణ పనులకు అడ్డంకులు తొలగనున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుతో పాటు స్వర్ణ, కడెం ప్రాజెక్ట్‌లకు మరమత్తులు లేక వాటి పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. ప్రాజెక్ట్‌ల్లోకి వరదనీటి ఉధృతి పెరిగే సమయంలో ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం స మస్యగా మారుతోంది. ఎప్పటికప్పుడు మరమత్తులు చేయకపోతున్న కారణంగానే గేట్ల సమస్య ప్రాజెక్టులకు శాపంగా మారుతోందంటున్నారు. దీంతో పాటు ప్రధాన కాలువల పరిస్థితి అన్ని చోట్ల గందరగోళంగా మారింది. కాలువలకు ఎప్పటికప్పుడు మరమత్తులు చేయని కారణంగా చాలా చోట్ల గండ్లుపడడం అలాగే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతుండడం సహజంగా మారిందంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రిఫ్‌ పథకం కింద జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లకు వరంగా మారబోతోందని ఇరిగేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

డ్యాం సేప్టీ కమిటీ సిఫారసులపై ఆశలు

ఇదిలా ఉండగా కేంద్రప్రభుత్వం ద్వారా అమలవుతున్న డ్రిఫ్‌ పథకం జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వరంగా మారబోతోందంటున్నారు. డ్రిప్‌ నిధులు డ్యాంసేప్టీ కమిటీ సిఫారసుల మేరకు మంజూరవుతాయి. ఇటీవలే డ్యాంసేప్టీ కమిటీ సభ్యులు జిల్లాలోని గడ్డెన్నవాగు, స్వర్ణప్రాజెక్ట్‌లను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ పరిశీలన అనంతరం కమిటీ సభ్యులు నిధులు మంజూరుకు సంబంధించి సిఫారసులు చేశారు. ఈ సిఫారసుల ఆధారంగా గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు రూ.9 కోట్లు, స్వర్ణ ప్రాజెక్ట్‌కు రూ. 13 కోట్లను మంజూరు అయ్యాయి. కొద్దిరోజుల్లోనే ఈ డ్యాం సేఫ్టీ కమిటీ కడెం ప్రాజెక్ట్‌ను కూడా సందర్శించే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచబ్యాంకు సహకారంతో డ్రిఫ్‌ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుండగా అందులో జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టులు ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 

ఎఫ్‌డీఆర్‌ కింద ప్రతిపాదనలు

కాగా ఇరిగేషన్‌ శాఖ పరిధిలో ఓఆండ్‌యం, ఎఫ్‌డీఆర్‌ కింద సాగునీటిప్రాజెక్ట్‌లు , చెరువుల మరమత్తుల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 102 పనులకు గానూ 1128. 42 లక్షలతో అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయగానే పనులు ప్రారంభించేందుకు ఇరిగేషన్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఇరిగేషన్‌ అధికారులు ప్రాజెక్టుల మరమత్తుల కోసం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. అయితే సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు జరగడం లేదంటున్నారు. 

 మరో నెల గడిస్తే.. 

కాగా డ్రిఫ్‌ పరిధిలోని పనులు గాని, ఎఫ్‌డీఆర్‌ పరిఽధిలోని పనులు గాని మరో నెల రోజుల్లో పూర్తికానట్లయితే ఇక ఈ ఏడు కూడా సాగునీటి రంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటి వరకు డ్రిఫ్‌, ఎఫ్‌డీఆర్‌కు సంబంధించిన నిధులు మంజూరైనప్పటికీ ఆ నిధులు విడుదలకాకపోవడంతో మరమత్తుల పనుల నిర్వహణ మొదలుకాలేదు. నిధులు విడుదలకాగానే అధికారులు ప్రాజెక్టులకు సంబందించిన పనులు చేపట్టేందుకు కొంతసమయం అవసరమవుతోంది. ఈ లోగా వర్షాలు కురిస్తే నిధులు విడుదలైనా పనులు చేపట్టడం కష్టమేనంటున్నారు. మార్చి చివరి వరకు నిధులు విడుదలైనట్లయితే ఇప్పటి వరకు పనులు చివరిదశకు చేరుకునే అవకాశం ఉండేదని, అయితే మళ్లీఈ సంవత్సరం కూడా ప్రాజెక్టులకు కాలువల ద్వారా నీటి ప్రవాహానికి ఇక్కట్లు తప్పవంటున్నారు.  

Updated Date - 2022-05-19T07:02:05+05:30 IST