Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆకలిని హరించే నీరు

ఆంధ్రజ్యోతి(04-04-2020)

ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగితే మంచిదా, కాదా అన్న విషయంలో ఎన్నో రకాల వాదనలున్నాయి. ఇప్పుడు దీనిపై శాస్త్రవేత్తలు మరికొంత స్పష్టత తీసుకొచ్చారు. భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి.. ఆకలికి అడ్డుకట్ట పడుతుందన్నవిషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది. నెదర్లాండ్స్‌లోని వాజెనింజెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆహారం తీసుకునేటప్పుడు కలిగే సంతృప్తి భావనల్ని పరిశీలించారు. తినేటప్పుడు పొట్టకు సంబంధించిన సంకేతాల్ని మెదడు ఎలా స్వీకరిస్తుందనే అంశాల్ని గ్రహించారు. ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగడం వల్ల పొట్ట నిండిందన్న సంకేతాలు మెదడుకు చేరుతున్నట్లు గుర్తించారు.

తినేటప్పుడు తాగేనీటి పరిమాణాన్ని పెంచడం ద్వారా పొట్ట విస్తరణ పెరుగుతోందనీ, స్వల్ప కాలంలో ఆకలికి అడ్డుకట్ట పడుతోందనీ, మెదడు క్రియాశీలత పెరుగుతోందని పరోశోధకులు చెబుతున్నారు.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement