ఆలూరు సమీపంలో ఆదోని రహదారి పక్కన వృథా అవుతున్న తాగునీరు
ఆలూరు రూరల్, జనవరి 23: ఆలూరు పట్టణానికి సమీపంలో ఆదోని రహదారి పక్కన తాగునీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. బాపురం జలాశయం నుంచి హులేబీడు, తుంబలబీడు, మనేకుర్తి, అంగసకల్ గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. గత నెల రోజులుగా ఆదోని రహదారి పక్కన గ్రామాలకు వెళ్లే పైపులైన్ లీకేజీ నీరు భారీగా వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.