వెంకటాపురంలో నెల రోజులుగా తాగు నీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-12-06T05:50:01+05:30 IST

మండలంలోని సాలికమల్లవరం శివారు వెంకటాపురంలో నెల రోజులుగా తాగు నీటి సమస్య వేధిస్తోంది. తాండవ రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో సుమారు నలభై కుటుంబాల వారు నివశిస్తున్నారు. ఇక్కడున్న తాగునీటి పథకానికి సంబంధించి మోటారు నెల రోజుల క్రితం పాడైంది.

వెంకటాపురంలో నెల రోజులుగా తాగు నీటి కష్టాలు
నిరుపయోగంగా ఉన్న నీటి పథకం ట్యాంకు

 నీటి పథకం మోటారు పాడవ్వడంతో సమస్య

అధికారులు స్పందించాలని వేడుకోలు

గొలుగొండ, డిసెంబరు 5 : మండలంలోని సాలికమల్లవరం శివారు వెంకటాపురంలో నెల రోజులుగా తాగు నీటి సమస్య వేధిస్తోంది. తాండవ రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో  సుమారు నలభై కుటుంబాల వారు నివశిస్తున్నారు. ఇక్కడున్న తాగునీటి పథకానికి సంబంధించి మోటారు నెల రోజుల క్రితం పాడైంది. అప్పటి నుంచి గ్రామస్థులను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో రిజర్వాయర్‌లో నీటిని తెచ్చుకుని తాగుతున్నట్టు చెపుతున్నారు. ఈ సమస్యను అధి కారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేక పోతుం దని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి మోటారుకు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. 

Updated Date - 2021-12-06T05:50:01+05:30 IST