ఎంపీడీవో కార్యాలయం వద్ద బైటాయించిన సీపీఎం నాయకులు
మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ దుర్గగుడ, కొత్తసుజనకోట, పెద్దపుట్ట గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేశారు. అంతకు ముందు దుర్గగుడ గ్రామం నుంచి వైస్ ఎంపీపీ సత్యనారాయణ ఆఽధ్వర్యంలో పాదయాత్రగా ఇక్కడికి వచ్చారు.
- ముంచంగిపుట్టు