తాగునీటి సమస్య రానీయొద్దు

ABN , First Publish Date - 2021-08-04T05:11:35+05:30 IST

తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. నెల్లిమర్లలో మంగళవారం పర్యటించిన ఆమె తొలుత ఈవీఎం గోదాం తనిఖీ చేశారు.

తాగునీటి సమస్య రానీయొద్దు
మాట్లాడుతున్న కలెక్టర్‌

 నెల్లిమర్ల, ఆగస్టు 3: తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్‌  సూర్యకుమారి ఆదేశించారు. నెల్లిమర్లలో మంగళవారం పర్యటించిన ఆమె తొలుత ఈవీఎం గోదాం తనిఖీ చేశారు. అనంతరం 6,7 వార్డు సచివాలయాలను సంద ర్శించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలో తాగునీటి సమస్యపై చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావులు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కమిషనర్‌ రామప్పలనాయుడుకు సూచించారు.  పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయాలన్నారు.  ఆరోగ్యానికి మేలు చేసే ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఈ జిల్లాలోనే ఇస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొవిడ్‌-19 మూడో దశపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని చెప్పారు. సచివాలయానికి వచ్చే ప్రజలపై సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహ రించాలని  తెలిపారు.  అనంతరం సోనియానగర్‌ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించి అక్కడి ఇంజినీర్లతో మాట్లాడారు.  తహసీల్దార్‌ రమణరాజు తదితరులు ఉన్నారు.  కలెక్టరేట్‌: కలెక్టర్‌ సూర్యకుమారి తన చాంబర్‌లో సీటును ఉత్తర దిక్కుకు మార్చుకున్నారు. గతంలో పని చేసిన కలెక్టర్‌కు తూర్పు దిక్కులో సీటు ఉండేది.  

 

Updated Date - 2021-08-04T05:11:35+05:30 IST