రాగి గ్లాసులో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2021-11-27T19:40:25+05:30 IST

రాగి గ్లాసులో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అంటే తప్పక ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ పెరిగేందుకు, త్రిదోషాలు బ్యాలెన్స్‌ అయ్యేందుకు ఇది బాగా పనికొస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు

రాగి గ్లాసులో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆంధ్రజ్యోతి(27-11-2021)

రాగి గ్లాసులో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అంటే తప్పక ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ పెరిగేందుకు, త్రిదోషాలు బ్యాలెన్స్‌ అయ్యేందుకు ఇది బాగా పనికొస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు.


బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


జీర్ణశక్తిని పెంచుతుంది.


కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.


అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 


ఆర్థరైటిస్‌ ఉన్న వారికి ఉపశమనాన్ని అందిస్తుంది.


శరీరం తగినంత ఐరన్‌ గ్రహించడం ద్వారా రక్తహీనత సమస్య దూరమవుతుంది.


థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.


చర్మ ఆరోగ్యం బాగవుతుంది. మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.


ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు సహాయపడుతుంది.

Updated Date - 2021-11-27T19:40:25+05:30 IST