చిన్నపొర్లలో తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2022-05-27T05:34:20+05:30 IST

రెండు రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిన్నపొర్లలో తాగునీటి కష్టాలు
వాటర్‌ ట్యాంకర్‌ వద్ద నీటి కోసం క్యూ కట్టిన గ్రామస్థులు

- నిలిచిన మిషన్‌ భగీరథ నీళ్లు 

- నీళ్ల కోసం పరుగులు పెడుతున్న జనాలు

ఊట్కూర్‌, మే 26 : రెండు రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని పాత ట్యాంక్‌ ద్వారా సరఫరా అయ్యె నీళ్లు కూడా రాకపోవడంతో ప్రజలకు పంచాయతీ నుంచి వస్తున్న వాటర్‌ ట్యాంకరే ఆసరగా మారింది. గ్రామంలోని 10 వార్డులకు ఒకే ట్యాంకర్‌ ఉండగా నీటి సరఫరాకు ఇబ్బం దిగా మారింది. దీంతో ప్రజలు నీళ్ల కోసం ఎదరు చేసే పరిస్థితి నెకొంది. గ్రామంలోని 9, 10, 1, 2, 5వ వార్డులో హ్యండ్‌ బోర్లు ఉన్నా మిగితా ప్రాంతాల్లో నీటి బోర్లు కూడా లేకపోవడంతో  దాదాపు ఆరు వార్డుల్లో ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో మిషన్‌ భగీరథ నీరు రాకపోతే ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం, మిషన్‌ భగీరథ కనెక్షన్‌ ఇచ్చినప్పటి నుంచి గ్రామంలో కొత్తగా నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో నీరు సరిగ్గా రావడం లేదని ప్రజలు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. పైగా వారానికి, 15 రోజులకో లీకేజీల తో నీటి సరఫరా నిలిచిపోవడంతో అన్ని పనులు వదులుకొని నీటికోసం పరుగులు పెట్టాల్సి వస్తోం దని గ్రామస్థులు పేర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Updated Date - 2022-05-27T05:34:20+05:30 IST