పల్లీలు తిన్న తర్వాత నీళ్లెందుకు తాగకూడదు..? తాగితే ఏం జరుగుతుందంటే..

ABN , First Publish Date - 2021-12-23T18:39:13+05:30 IST

పల్లీలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది? పల్లీల్లో ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వాటిని తిన్న వెంటనే నీళ్లు తాగొద్దని మాత్రం పెద్దలు వారిస్తుంటారు.

పల్లీలు తిన్న తర్వాత నీళ్లెందుకు తాగకూడదు..? తాగితే ఏం జరుగుతుందంటే..

పల్లీలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది? పల్లీల్లో ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వాటిని తిన్న వెంటనే నీళ్లు తాగొద్దని మాత్రం పెద్దలు వారిస్తుంటారు. ఇలా ఎందుకు చెబుతున్నారు. అసలు పల్లీల వల్ల కలిగే లాభాలేంటి..? వాటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే వచ్చే నష్టాలేంటి..? అన్న వివరాల్లోకి వెళ్తే..


వేరుశెనగలంటే ఇష్టపడని వారే ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు. కొంత మందికి టైంపాస్ కాలేదంటే వెంటనే గుర్తుకొచ్చేది పల్లీలే. ఆ సమయంలో కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొంతమంది వేయించుకుని తింటారు. ఇలా అందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఏదైనా ఉందంటే అవి వేరుశెనగలే. ఇక పల్లీలు లేకుండా ఏ వంటకం ఉంటుంది. అల్పాహారం దగ్గర నుంచి భోజన వంటల వరకూ పల్లీల లేకుండా ఏ వంటకం ఉండదు. కేకులు, మిఠాయిలు, స్నాక్స్, సాస్‌లు మరియు వివిధ రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. దీనికంతటికి కారణం పల్లీల్లో అత్యధికంగా పోషకాలు దాగి ఉండడమే. అంతేకాదు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటిన్, మాంగనీసు వేరుశెనగల్లో అధికంగా ఉంటాయి. వేరుశెనగలు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడటమే కాకుండా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తాయిని అధ్యయనాలు చెబుతున్నాయి.


ఇలా పల్లీల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు కేన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల కేన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్-ఇ అధిక శాతంలో ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించడమే కాకుండా ఆక్సిజన్ ప్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇంకా ఇందులో బీ కాంప్సెక్స్ విటమమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు రక్తస్రవరణ బాగా జరిగేలా చేస్తుంది. అలాగే ఎముకుల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్‌ను అందిస్తుంది. ఇంత బాగుగా ఆరోగ్యాన్ని ఇచ్చే వేరుశెనగల విషయంలో కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


పల్లీలు ఎంతో ఇష్టంగా తింటుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదంటారు. ఇలా పెద్దలు ఎందుకు చెబుతారో తెలియక గజిబిజి అవుతుంటారు. దీనికి కారణాలు లేకపోలేదు... వేరుశెనగలు పోషకాహారం మరియు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న మాట వాస్తవం. అయితే వేరుశెనగలు చాలా పొడి స్వభావం కలిగి ఉండటం వల్ల అధిక దాహాన్ని ప్రేరేపించే ధోరణిని కలిగి ఉంటాయి. అందుకొరకే తిన్న వెంటనే నీటిని తాగకూడదంటారు. పైగా ఇందులో నూనె ఉండటం వల్ల తిన్న తర్వాత నీటిని తీసుకోవడం వల్ల ఆహార పైపులో కొవ్వు పేరుకుపోవచ్చు. ఫలితంగా చికాకు మరియు దగ్గు వస్తుందని చెబుతున్నారు.  రెండో సంగతి పల్లీలు తినగానే నీరు తాగితే త్వరగా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావొచ్చు. మూడో సంగతి ఏంటంటే... పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు తిన్న వెంటనే నీటిని తాగితే అవి చల్లగా మారతాయి. దీని వల్ల లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. అందుకొరకే తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల దుష్పరిణామమాలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. కనుక పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగకుండా కొద్ది సేపు గ్యాప్ ఇచ్చి తాగితే ఉత్తమం.

Updated Date - 2021-12-23T18:39:13+05:30 IST