Abn logo
Apr 17 2021 @ 01:05AM

తాగునీటి కష్టాలు.. తప్పని అవస్థలు!

  • కాల్వలు అడుగంటాక అధికారుల ఏర్పాట్లు

సామర్లకోట, ఏప్రిల్‌ 16: సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీతోపాటు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు సామర్లకోటలోని వేసవి జలాశయం, సాంబమూర్తి రిజర్వాయర్‌లలో గోదావరి జలాలను నింపేందుకు ఆయా మున్సిపల్‌ అదికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. గోదావరి కాలువలో జలాలను సరఫరా చేసినప్పుడు జలాశయాలను గోదావరి జలాలను నింపాల్సిన మున్సిపల్‌ అధికారులు చోద్యం చూసి ఇప్పుడు కాలువలో నీటి సరఫరా లేని సమయంలో కొద్దిపా టి నీటిని పంపింగ్‌ చేసేందుకు పెద్దపెద్ద జనరేటర్లు, మోటార్లను ఏర్పాటుచేసి హడావుడి చేస్తున్నారు. సామర్లకోట కాలువ లాకుల వద్ద, పీబీసీ కెనాల్‌ వద్ద సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ నగర పాలకసంస్థలు శుక్రవారం నుంచి భారీ జనరేటర్ల సహా యంతో గోదావరి జలాలను జలాశయాలలోకి పంపింగ్‌ చేస్తున్నాయి. కాగా గోదావరి జలాలను జలాశయాల్లోకి మళ్లించే పనులను ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు, ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఐవీ సత్యనారాయణ, శ్రీరామకృష్ణ, హుస్సేన్‌ పరిశీలించారు.

Advertisement
Advertisement
Advertisement