ఆరోగ్యం పేరుతో రోజుకు 8 గ్లాసుల నీటిని తాగుతున్నారా?.. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-12-16T17:11:25+05:30 IST

తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల..

ఆరోగ్యం పేరుతో రోజుకు 8 గ్లాసుల నీటిని తాగుతున్నారా?.. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోండి!

తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. నీటిని తాగడం వలన మన శరీరం హైడ్రేట్‌గా ఉండడంతో పాటు, శరీరంలోని విష కణాలు తొలగిపోతాయి. శరీరంలోని అన్ని అవయవాలు సజావుగా పనిచేయడానికి నీరు ఎంతగానో దోహదపడుతుంది. అయితే నీరు అధికంగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం మీకు తెలుసా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? సైన్స్ ప్రకారం మనిషి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. రోజుకు 8 లేదా 9 గ్లాసుల కంటే ఎక్కువ నీటిని తాగితే, తలెత్త అనారోగ్య సమస్యల గురించి నిపుణులు తెలిపిన వివరాలు.. 


హైపోనట్రేమియా 

ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ద్రవం ఓవర్‌లోడ్ అయి, అసమతుల్యత ఏర్పడుతుంది. శరీరంలో చేరిన అధిక నీరు.. సోడియం స్థాయిలను తగ్గిస్తుంది, ఫలితంగా వికారం, వాంతులు, తిమ్మిరి, అలసట లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిని హైపోనట్రేమియా అంటారు.

అలసట 

నీరు ఎక్కువగా తాగడం వల్ల అలసట వస్తుంది. మీరు తాగే నీటిని ఫిల్టర్ చేయడానికి, మీ రక్త ప్రసరణలో ద్రవ స్థాయిని సమతుల్యం చేయడానికి మూత్రపిండాలు పనిచేస్తాయి. అయితే శరీరానికి అధికశాతంలో నీరు అందినపుడు మీ మూత్రపిండాలు మరింతగా పనిచేయాల్సివస్తుంది, ఇది హార్మోన్లపై ప్రభావం చూపి, అలసటను కలిగిస్తుంది. 

పొటాషియం లోపం

నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుంది, ఇది శరీరానికి అవసరమైన ముఖ్యపోషకం. పొటాషియం లోపం వలన  కాళ్ల నొప్పులు, కడుపులో మంట, ఛాతీ నొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.


తలనొప్పి: 

ఓవర్ హైడ్రేషన్, డీహైడ్రేషన్ రెండింటి వల్లా తలనొప్పి వస్తుంది. మీరు ఎక్కువ నీరు తాగినప్పుడు, మీ రక్తంలో ఉప్పు శాతం తగ్గిపోతుంది, ఇది తలనొప్పికి దారి తీయడంతో పాటు శరీర భాగాల్లో వాపులు ఏర్పడతాయి. 

ఎలక్ట్రోలైట్ స్థాయి తగ్గుదల: 

మీరు ఎక్కువగా నీరు తాగినప్పుడు, మీ ఎలక్ట్రోలైట్ స్థాయి పడిపోతుంది. ఫలితంగా బ్యాలెన్స్ చెదిరిపోతుంది. తక్కువ ఎలక్ట్రోలైట్ స్థాయి ఏర్పడినప్పుడు కండరాల తిమ్మిరి లాంటి లక్షణాలను కనిపిస్తాయి. 

తరచుగా మూత్రవిసర్జన: 

మీరు ఎక్కువ నీరు తాగినప్పుడు, తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం అవసరమైన పోషకాలను గ్రహించలేదు.

Updated Date - 2021-12-16T17:11:25+05:30 IST