ఆటోలో మందుబాబుల హల్‌చల్.. బోల్తా

ABN , First Publish Date - 2020-07-11T02:56:23+05:30 IST

కృష్ణా : జిల్లాలోని కొండపల్లిలో మందుబాబులు హల్‌చల్ చేశారు.

ఆటోలో మందుబాబుల హల్‌చల్.. బోల్తా

కృష్ణా : జిల్లాలోని కొండపల్లిలో మందుబాబులు హల్‌చల్ చేశారు. పూటుగా మద్యం సేవించడమే కాకుండా ఆటోలో మద్యం తీసుకుని వెళ్తూ అరుపులు కేకలేస్తూ రోడ్డున పోయే వాహనదారులను తిడుతూ హల్‌చల్ చేశారు. ఆటో డ్రైవర్‌ కూడా మద్యం మత్తులో ఉండటంతో రోడ్డుపై వెళ్తున్న పలువురు పాదాచారులను, వాహనదారులను ఢీ కొట్టారు. వారి చర్యలతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. కొండపల్లి శాంతి నగర్ వద్ద అడ్డొచ్చిన పోలీసులను, స్థానికులను తప్పించబోయిన ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-11T02:56:23+05:30 IST